
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రధానంగా రెండు విషయాలను చర్చించింది. ఏపీలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని, వీటిమధ్య సమతూకం సాధించాలని పేర్కొంది. దీనికోసం రెండు అంచెల వ్యూహాన్ని సూచించామని కమిటీ సూచించింది.
కోస్తా, సీమ ప్రాంతాల మధ్య వనరుల వినియోగం ప్రభావవంతంగా జరగాలని, ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా నివేదిక ఇచ్చినట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడుచేసుకోవడం కాదని కమిటీ స్పష్టం చేసింది. 13 జిల్లాల అభివృద్ధికి విధానాలను ప్రతిపాదించినట్టు పేర్కొంది.
అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉండాలని కమిటీ సూచించిందిద. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్లుగా ఉత్తర, మధ్య, దక్షిణ కోస్త, రాయలసీమ రీజియన్లుగా విభజించాలని పేర్కొంది. వరదముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించింది.
విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సెక్రటేరియట్, వేసవి అసెంబ్లీ, హైకోర్టు ఉండాలని పేర్కొంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని, తుళ్లూరులోనే అసెంబ్లీ ఉండాలని కమిటీ వివరించింది. తుళ్లూరు, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.








