27.8 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ‘చింతమనేని’పై మళ్లీ మరో కేసు, ఫోన్‌లో బెదిరించాడంటూ…

‘చింతమనేని’పై మళ్లీ మరో కేసు, ఫోన్‌లో బెదిరించాడంటూ…

tdp leader-chintamaneni-prabhakar
- Advertisement -

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై మంగళవారం మరో కేసు నమోదైంది. ఫోన్ చేసి తనను చింతమనేని బెదిరించాడంటూ జోసెఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.  చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్నాడు. 

దళితులను దూషించాడంటూ నమోదైన కేసులో గత నెల 11వ తేదీన చింతమనేనిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం అతడిని రిమాండుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న అతడిపై తాజాగా మరో కేసు నమోదు అవడం గమనార్హం. ఒకవైపు అతడు జైలులో ఉండగానే పలువురు అతడిపై ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఓడిపోయిన తరువాత నుంచీ…

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతమనేనిపై కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు కూడా ప్రస్తావిస్తున్నాయి. 

ప్రభాకర్ ఓటమిపాలయినప్పట్నించి అతడిపై పాత కేసులు తిరగదోడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి అతడ్ని వేధిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. తాజాగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. జైలులో ఉన్న చింతమనేని జోసెఫ్ అనే వ్యక్తిని ఎలా బెదిరించగలడంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 

నిజానికి ఒక్క చింతమనేనిపైనే కాదని, ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి చెందిన కీలక నేతలందరినీ ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై నమోదైన కేసుల గురించి టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. 

- Advertisement -