27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన జగన్ సర్కారు.. మరో సంచలన నిర్ణయం!

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన జగన్ సర్కారు.. మరో సంచలన నిర్ణయం!

- Advertisement -

అమరావతి: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తి వద్ద ఆరు మద్యం బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధలను రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించారు. నిబంధలను నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ హెచ్చరించారు.

సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. అక్టోబరు 1 నాటికి వీటిని మూడు వేలకు పెంచనున్నారు. ఈ సందర్భంగా తొలి విడత షాపుల నిర్వహణకు సంబంధించి గురువారం నాయక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించినట్టు చెప్పారు. జూన్‌ 1నుంచి ఆగస్ట్‌ చివరి నాటికి 2,500 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను 4,380 నుంచి 3,500కు తగ్గించినట్టు చెప్పారు.

అలాగే కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక పర్మిట్ రూములు ఉండవని అన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు నడుస్తాయని నాయక్ స్పష్టం చేశారు.

- Advertisement -