22.7 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఐసీయూలో ‘కోడెల’.. నిలకడగానే ఆరోగ్యం…

ఐసీయూలో ‘కోడెల’.. నిలకడగానే ఆరోగ్యం…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పితో కోడెల కుప్పకూలారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ని గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోడెలకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ అల్లుడు మనోహర్‌కు చెందిన ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే కోడెలకు గుండె నొప్పి వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

అసెంబ్లీ ఫర్నిచర్‌ మాయం అయిందనే విషయానికి సంబంధించి శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. అలాగే సత్తెనపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్ల చోరీ వ్యవహారం కూడా కోడెలను మరింత ఒత్తిడికి గురి చేసింది.

ఒకవైపు అసెంబ్లీ ఫర్నిచర్‌ మిస్సింగ్‌ కేసు, మరో వైపు క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్ల చోరీ.. కోడెలను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.  అదే ఆయనకు గుండెపోటు రావడానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

- Advertisement -