32.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో కుమ్మేయనున్న వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో కుమ్మేయనున్న వర్షాలు

- Advertisement -

అమరావతి: ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చింతూరు, దెందులూరు, పెదవేగిలో 8 సెంటీ మీటర్లు, ఏలూరు, రాజమండ్రి, కూనవరంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆవర్తనానికి తోడు రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, థాయ్‌లాండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఈ నెల 4న తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మధ్యభారతం దానికి ఆనుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

శనివారం కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 5 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.

- Advertisement -