
లండన్: గాయాలు తనను ఏమీ చేయలేవని ట్వీట్ చేశారు ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్. నేను ఏం చేయాలనుకున్నానో అది చేసి చూపిస్తానన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది అభిమానులను ఉర్రూతలూగించిన గబ్బర్… ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.
చదవండి:48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారుల మరణం… కారణం..?
దీంతో వరల్డ్ కప్ మ్యాచ్ లకు దూరంగా ఉంటుండడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ విషయంపై ట్వీట్ చేసిన శిఖర్ ధావన్ ఓ పద్యం ద్వారా తన అంతరంగాన్ని తెలిపారు.
గాయం నుంచి త్వరగా కోలుకుంటానని మరింత ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టి తానేంటో నిరూపిస్తాను అనేది ట్వీట్ సారాంశం. కాగా… దీనిపై భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాకు గబ్బర్ కావాలని… తనను మైదానంలో మిస్ అవుతామని చెబుతున్నారు.
ట్వీట్ కు ముగ్ధులైన ఫ్యాన్స్… గాయమైన బ్యాటింగ్ కంటిన్యూ చేసి శతకం బాదిన గబ్బర్ వెంటనే కోలుకుని రావాలని కోరుకుంటున్నట్లు రీట్వీట్ చేస్తున్నారు.








