24.1 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కడపజిల్లా ఎమ్మెల్యేకి క్యాబినెట్ లో చోటు! విజయవాడకు బయల్దేరిన ఎమ్మెల్యే

కడపజిల్లా ఎమ్మెల్యేకి క్యాబినెట్ లో చోటు! విజయవాడకు బయల్దేరిన ఎమ్మెల్యే

YS Jagan Latest News, Kadapa MLA News, AP Cabinet News, Newsxpressonline
- Advertisement -

కడప: ఈ నెల 8న మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైన జగన్.. పదవుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 7న వైసీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలోనే కేబినెట్ బెర్తులు ఎవరెవరికి దక్కుతాయో ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది.

సామాజిక వర్గాలు.. జిల్లాలవారీగా లెక్కలతో జాబితాపై ఓ అవగాహనకు వచ్చేశారు జగన్. ఈ జాబితాకు ఫైనల్‌ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇదే సందర్భంగా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమయ్యిందని ప్రచారం జరుగుతోంది.

రైల్వే కోడూరు నుంచి గెలిచిన కొరుముట్ల శ్రీనివాసులకు సీఎం వైఎస్ జగన్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. మంత్రివర్గంలో చేరబోతున్నారని చెప్పారట. శుభవార్త అందగానే కొరుముట్ల విజయవాడకు పయనమయ్యారట. ఇటు ఎమ్మెల్యే అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారట. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచుకున్నారట.

కొరముట్ల శ్రీనివాసులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి రైల్వే కోడూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత వైసీపీలో చేరిన శ్రీనివాసులు.. 2014లో తిరిగి గెలిచారు. 2019లోనూ ఘన విజయం అందుకొని హ్యాట్రిక్ కొట్టారు.

చదవండి:  ఏపీలో సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం!
- Advertisement -