
అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో….చాలామంది టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు టీడీపీని వీడగా….మరికొందరు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఏపీ స్వచ్ఛాంధ్రమిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీఎల్ వెంకట్రావు వైసీపీలోకి చేర బోతున్నారు.
ఆ పార్టీలో చేరడానికి సహచరులు కొంతమందితో కలిసి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కైకలూరు నియోజక వర్గంలో టీడీపీకి కొన్నేళ్లుగా అండగా ఉన్న ఆయన సడన్‌గా పార్టీ మారుతుండటంతో కార్యకర్తలు షాక్‌కి గురయ్యారు.
ఇక మంత్రి వర్గం ఏర్పాటయ్యాక తాను వైసీపీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో టీడీపీ సిద్ధాంతాలు కనుమరుగయ్యాయని వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. అలాగే టీడీపీ బద్ధశత్రువు, ఏపీని విచ్ఛినం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం తాను జీర్ణించుకోలేకపోయానని అన్నారు.
చదవండి: జూన్ 8న ఏపీ మంత్రివర్గం విస్తరణ….!








