22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీదే హవా… బాబుకు హ్యాండ్ ఇచ్చిన ఉద్యోగులు!?

పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీదే హవా… బాబుకు హ్యాండ్ ఇచ్చిన ఉద్యోగులు!?

AP Political News, AP Election News, YCP Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో ఉంది. ముందుగా కౌంట్ చేసిన బ్యాలెట్ ఓట్లలో… ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు అర్ధమవుతుంది.

శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

అటు మంగళగిరిలో లోకేశ్ ఆధిక్యంలో ఉండగా, చీపురుపల్లిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. భీమిలిలో టీడీపీ నేత సబ్బం హరి, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు ఆధిక్యంలో ఉన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, బొబ్బిలిలో టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు,  అరుకులో కిడారి శ్రవణ్ కుమార్, పెద్దాపురంలో  నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురంలో టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -