- Advertisement -
కర్నూలు: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లాలోని నంద్యాల చేరుకున్నారు. గత నెల 30న కన్నుమూసిన ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన విషయం అందరికి తెలిసిందే.
అయితే, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇటీవల ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లిన పవన్, తొలుత ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం ఎస్పీవై రెడ్డి నివాసానికి వెళ్లి… ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడితో కాసేపు పవన్ మాట్లాడారు.
చదవండి: పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావొచ్చు! మెగా బ్రదర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Advertisement -








