
అమరావతి: తనకు ప్రజలు ఓటు వేయకున్నా ఫర్వాలేదని… సైకిల్, ఫ్యాన్, గ్లాస్ గుర్తులకు మాత్రం వేయవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ రోడ్ షో అసాంతం నవ్వులతో సాగింది.
ఓ యువకుడు వైసీపీ జెండాను పాల్‌కు చూపించగా.. నేను వచ్చానని వైసీపీ జెండాను పీకేశారని, ఇలాంటి అద్భుతాలు ముందు ముందు ఎన్నో ఉంటాయి..’’ అని వ్యాఖ్యానించారు.
‘‘మన పార్టీ గుర్తు ఏంటి?’’
ఓ గ్రామంలో వృద్ధుడు తనకు రుణమాఫీ కాలేదని చెబుతూ, తన రుణాన్ని మాఫీ చేస్తే, మీకే ఓటేస్తానని పాల్‌తో అనగా.. వెంటనే పాల్ మన పార్టీ గుర్తు ఏంటని ప్రశ్నించారు. ఆ వృద్ధుడు సైకిల్ అనేయడంతో ఆయన అవాక్కయ్యారు. కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం ఫక్కున నవ్వేశారు.
తరువాత పాల్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన మనవడికి 8 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారని, తనకు ప్రాణహాని ఉన్నా ఇద్దరు గన్మెన్లతో ప్రచారం చేసుకుంటున్నానని అన్నారు. తనకు అధికారం ఇస్తే, ఏపీని అమెరికా మాదిరిగా మారుస్తానంటూ హామీ ఇచ్చారు.








