22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

KA Paul Latest News, KA Paul Talks Pawan Kalyan and KCR, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడిని తానేనని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలిస్తే ఐదేళ్లు నరకం చూపించారని విమర్శించారు. జగన్ ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని స్వయంగా ముఖ్యమంత్రే ఆరోపిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం.. అన్నీ ఇస్తాం అంటున్న పవన్ ఎలా ఇస్తారని ప్రశ్నించి కేఏ పాల్.. ఎవరినైనా ధనవంతురాలిని పెళ్లి చేసుకుని ఆ వచ్చే కట్నం డబ్బులు తెచ్చి ఇస్తారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, జనసేనపై విమర్శలు గుప్పించారు. ఓటేస్తే గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. జగన్‌కు ఓటు వేస్తే, అది మోడీ, కేసీఆర్ ఖాతాలోకి వెళుతుందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ భయపడతారు

తనను చూస్తే కేసీఆర్ భయంతో పారిపోతారని, ఆయన ముక్కును పిండే శక్తి తనకుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న నేతను తాను మాత్రమేనని చెప్పుకొచ్చారు. తాను సీఎం అయితే రాష్ట్రానికి రూ.7లక్షల కోట్లు తెస్తానని పాల్ చెప్పారు.
రూ.2.5లక్షలతో అప్పులన్నీ తీర్చేసి.. మిగిలిన రూ.4.5లక్షలతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానన్నారు.

ఏడాదిలోనే అన్ని నియోజకవర్గాల్లో రూ.100కోట్లతో హాస్పిటల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సహా వివిధ దేశాల అధ్యక్షులను విజయవాడ, విశాఖ నగరాలకు తీసుకొస్తానన్నారు. గతంలో పవర్ లేకుండా ఎంతో చేశానని, ఇప్పుడు అధికారం ఇస్తే మరెంతో చేస్తానని పాల్ తెలిపారు.

చదవండి: కేసీఆర్ ప్లాన్ అదే! మోడీకి లెటర్ కూడా రాశారు.. నా దగ్గరుంది..: నారా లోకేశ్

- Advertisement -