30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జగన్.. కౌంటర్ ఇచ్చి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసిన వైసీపీ అధినేత

చంద్రబాబు వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జగన్.. కౌంటర్ ఇచ్చి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసిన వైసీపీ అధినేత

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చేతులు కలిపిన జగన్ తెలంగాణకు ఏపీని బానిసగా చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు పదేపదే చేస్తున్న ఆరోపణలకు జగన్ సోమవారం స్పందించారు. ‘నేను కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటి?’ అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన జగన్ తమ మధ్య ఉన్న బంధాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు. చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుని నిజాన్ని బయటపెట్టేసిన జగన్ తమ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశారు.

చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పదేపదే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాల్సింది పోయి ‘నిజమే’నంటూ జగన్ చెప్పడాన్ని వైసీపీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఆయన వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అధినేత వ్యాఖ్యలతో తామిప్పుడు ఆత్మరక్షణలో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

కేసీఆర్‌తో తాము కలిసేది ప్రత్యేక హోదాకోసమేనన్న వ్యాఖ్యలపైనా శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటులో ఏపీ హోదా కోసం ప్రస్తావన వస్తే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా మాట్లాడుతూ తాము అధికారంలో వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలంగాణ గడ్డపై ప్రకటించడంతో కేసీఆర్ అంతెత్తున లేచారు.

అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అటువంటి కేసీఆర్‌తో ఏపీకి ప్రత్యేక హోదా కోసమే కలుస్తామన్న జగన్ మాటలు నమ్మదిగినవిగా లేవని వాపోతున్నారు. అధినేత వ్యాఖ్యలు ఇప్పుడు తమను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయని చెబుతున్నారు.

- Advertisement -