27.2 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ డేటా చోరీ కేసు: అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు

డేటా చోరీ కేసు: అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు

IT Grids Ashok's quash petition postponed to 20th March
- Advertisement -

హైదరాబాద్‌: డేటా చోరీ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై తెలంగాణ పోలీసులు అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని అశోక్‌ హైదరాబాద్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు.. పోలీసులుః ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కేసు తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. ఇక అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వాదనలు వినిపించారు. కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్‌ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు.

మరోవైపు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేమని అశోక్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వెంటనే అశోక్‌ను పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రస్తుతం అజ్ఢాతంలో ఉన్న అశోక్‌ ఏపీ సిట్‌ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్‌ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

- Advertisement -