26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ రోజా! చంద్రబాబు తంతే పాతాళానికి పోతావు..: దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు

రోజా! చంద్రబాబు తంతే పాతాళానికి పోతావు..: దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు

divyavani
- Advertisement -

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తంతే.. రోజా పాతాళ లోకానికి వెళ్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి డ్రామా మాదిరే వైసీపీ నేతలు రేపు చేప ముల్లు డ్రామా ఆడతారని దుయ్యబట్టారు.

కేవలం నాలుగేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన రోజానే ఎగిరెగిరి పడుతుంటే… 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. రోజా ఔట్ డేటెడ్ నాయకురాలని ఆమె ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రోజాకు పరాభవం తప్పదని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ పథకానికి అనుకూలమా? కాదా? అనే విషయాన్ని రోజా చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే వైసీపీ నేతలకు బాధ ఎందుకని ప్రశ్నించారు.

పరిటాల కుటుంబంపై బురదజల్లే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ గడ్డ రాయలసీమను చంద్రబాబు పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతున్నారని దివ్యావాణి అన్నారు.

చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉంది: బుద్ధా

రోజా విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. రోజా ఎప్పుడైనా నిజం చెప్పారా? ఈ చెక్కులు తీసుకున్న వారెవరైనా చెల్లలేదని చెప్పారా? అని ప్రశ్నించారు. చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉందని.. ఈ చెక్కులు కూడా చెల్లనివని ఆమె అనుకుంటోందని సెటైర్లు విసిరారు.

సినీ రంగంలో ఉన్నప్పుడు ఆమె చెల్లని చెక్కులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని రోజాపై సెటైర్ వేశారు. డ్వాక్రా మహిళలకు మూడు చెక్కులిచ్చేసి పండగ చేసుకోండని చంద్రబాబు అంటున్నారంటూ వైసీపీ నేత రోజా విమర్శించిన విషయం తెలిసిందే.

చదవండి: మహిళల ద్రోహి, నరకాసుర పాలన: సీఎం చంద్రబాబు‌‌పై మరోసారి వైసీపీ ఫైర్ బ్రాండ్ నిప్పులు, సవాల్!

- Advertisement -