26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అప్పడాలపైనా ‘చంద్రబాబు’: కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు మామూలుగా లేవుగా!

అప్పడాలపైనా ‘చంద్రబాబు’: కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు మామూలుగా లేవుగా!

babu appadam
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు నెటిజన్లు కూడా సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా భోజనంతోపాటు ప్రజలకు పంచిపెట్టిన అప్పడాలపై సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడం ఇందుకు కారణం. ప్రచారం కోసం చివరకు అప్పడాలను కూడా వదిలిపెట్టలేదా బాబూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబుపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘కొంపదీసి శారదా స్కాం మీ హస్తముందా?.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే..

అంతేకగా, ‘కొంపదీసి శారదా స్కాం మీ హస్తముందా? అంటూ కన్నా నిలదీశారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు అని నిలదీశారు. ‘కొంపతీసి ‘శారదా స్కామ్’లో కూడా ‘తమరి హస్తం’ ఉందా?!? ‘పచ్చ కామెర్లు’ వాడికి లోకం ‘పచ్చగా’ కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ హైడ్రామా విషయంలో కేంద్రంపై చంద్రబాబు విమర్శలు చేసిన నేపథ్యంలో కన్నా పై విధంగా స్పందించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని కన్నా ప్రశ్నించారు.

‘కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?’అని వరుస ట్వీట్లలో చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు కన్నా లక్ష్మీనారాయణ.

 

 

 

 

 

- Advertisement -