

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వాహనాల నంబర్ ప్లేట్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్ అమలు చేయాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 39 సిరీస్ అమలులోకి వచ్చినట్లయింది.
తాజా నిర్ణయంతో బుధవారం నుంచి అమ్ముడయ్యే అన్ని వాహనాలకు ఏపీ 39 సిరీస్‌తో నంబర్ ప్లేట్లను జారీ చేస్తారు. ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఏపీ సిరీస్ నెంబర్ ఏపీ 39
ఈ సందర్భంగా ఏపీ 39 సిరీస్‌లో తొలి నంబర్ ఏపీ 39 0002’ను ఎం.కల్పన అనే మహిళకు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ జిల్లాల వారీగా అమలు చేస్తున్న సిరీస్ విధానం ముగిసిపోనుంది.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…”ఇక ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39జెడ్, పోలీసుల వాహనాలకు ఏపీ 39పీ, రవాణా వాహనాలకు ఏపీ 39 టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లను కేటాయించాం..” అని చెప్పారు.








