19.7 C
Hyderabad
Monday, November 9, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అగ్రవర్ణ పేదల 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం: చంద్రబాబు, చిచ్చుపెట్టొద్దని కాపునాడు

అగ్రవర్ణ పేదల 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం: చంద్రబాబు, చిచ్చుపెట్టొద్దని కాపునాడు

chandrababu
- Advertisement -

kapunadu

అమరావతి: మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌)లకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని అమలుపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించి.. అందులో 5శాతం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఆ రిజర్వేషన్లలో మాకు వాటా వద్దు, చిచ్చుపెడతారా?: కాపునాడు

అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఇచ్చే వాటా తమకు అవసరం లేదని రాష్ట్ర కాపునాడు సంఘం నేతలు స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపు వ్యతిరేకి.. మాయ మాటలు చెప్తాడు నమ్మవద్దని అన్నారు.

మరోసారి ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను మోసం చేయడాని​కి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రచారం చేస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ చేత్తో రిజర్వేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి.. మరో చేత్తో కోర్టులో కేసులు వేయిస్తున్నారంటూ మండిపడ్డారు.

‘చంద్రబాబు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలోనే కాపులకు వాటా ఇస్తానని అంటున్నాడు. ఇలా చేయడం అంటే కాపులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టడమే’ అని వారు తెలిపారు. ఈబీసీ కోటాలో ఇచ్చే రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని చెప్పారు.
2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -