23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home రాజకీయం యూపీ సీఎం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు: రాహుల్ గాంధీ

యూపీ సీఎం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం సరికాదన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఓ మహిళ యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేస్తే జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

చదవండి : రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

బీజేపీ, ఆరెస్సెస్ కు చెందిన మీడియా తనపై చేసిన దుష్ప్రచారంతో పోలిస్తే… అసలు ఇది లెక్కకు రాదన్నారు. ఆ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులపై కేసులు పెడితే…. వారికి సిబ్బంది కొరత వస్తుందని ఎద్దేవా చేశారు.

ఇలాంటి కామన్ థింగ్స్ ను భూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు రాహుల్. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం నిజంగా మూర్ఖత్వం అనిపించుకుంటుందన్నారు. వెంటనే అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -