25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పనిగట్టుకుని ఇలానా?: పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ చురకలు…

పనిగట్టుకుని ఇలానా?: పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ చురకలు…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

పనిగట్టుకుని దుష్ప్రచారమా?

‘దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారు..’ అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కేటీఆర్ చురకలంటించారు.

https://twitter.com/KTRTRS/status/1109118684101001217

కాగా ‘మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం.. కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లంటే అలుసు.. కుల వర్గ భేదాలు లేకుండా మన వాళ్లను కొడుతున్నారు..’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాధ్యతయుతమైన ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటం సరికాదని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, ప్రజలు హితవు పలుకుతున్నారు. కాగా, తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమపై ఎలాంటి దాడులు జరగలేదని తెలంగాణలో నివాసముంటున్న ఆంధ్రావాసులు పేర్కొంటుండటం గమనార్హం.

 

- Advertisement -