

న్యూఢిల్లీ/హైదరాబాద్: వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సామాజికవేత్త నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.
భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు తీజాన్ బాయి (కళలు), అనిల్‌కుమార్ మణీభాయ్ నాయక్ (వ్యాపారం, వాణిజ్యం), బల్వంత్ మోరేశ్వర్ పురంధరే (నాటక రంగం), ఇస్మాయిల్ ఒమర్ గులే (ప్రజా సంబంధాలు)ను ఎంపిక చేశారు.
వీరిలో ఇస్మాయిల్ ఒమర్ గులే విదేశీయులు కావడం గమనార్హం.
2019కి గాను మొత్తం 14 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. వీరిలో కథానాయకుడు మోహన్ లాల్, సైంటిస్ట్ నంబి నారాయణ్, ప్రముఖ పాత్రికేయులు కుల్దీప్ నయ్యర్ ఉన్నారు. అమెరికాకు చెందిన జాన్ చాంబర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన ప్రవీణ్ గోర్ధన్‌కు కూడా పద్మభూషణ్ ప్రకటించడం విశేషం.
పద్మ భూషణ్ అవార్డులు:
జాన్ చాంబర్స్(విదేశీయుడు)-ట్రేడ్, ఇండస్ట్రీ టెక్నాలజీ(అమెరికా)
సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా- పబ్లిక్ ఏఫేర్స్ పంజాబ్
ప్రవీణ్ గోర్ధన్(విదేశీయుడు)- పబ్లిక్ ఏఫేర్స్- దక్షిణాఫ్రికా
మహాశయ్ ధరమ్ పాల్ గులాటీ-ట్రేడ్, ఇండస్ట్రీ ఫుడ్ ప్రాపెసింగ్-ఢిల్లీ
దర్శన్ లాల్ జైన్- సోషల్ వర్క్-హర్యానా
అశోక్ లక్ష్మణ్ రావు కుకడే-మెడిసిన్-అందుబాటులో వైద్యసేవలు-మహారాష్ట్ర
కరియా ముండ- పబ్లిక్ ఏఫేర్స్-జార్ఖండ్
బుద్ధాదిత్యా ముఖర్జీ- కళలు-సంగీతం-సీతార-పశ్చిమబెంగాల్
మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్-కళలు-నటన-సినిమా-కేరళ
ఎస్ నంబి నారాయణ్-సైన్స్, ఇంజినీరింగ్ స్పేస్-కేరళ
కులదీప్ నాయర్(మరణాంతరం)-లిటరేచర్, విద్య(జర్నలిజం)-ఢిల్లీ
బచేంద్రిపాల్ పాల్-స్పోర్ట్స్(పర్వతారోహకులు)
వీకే షుంగ్లు – సివిల్ సర్వీస్ – ఢిల్లీ
హుకుందేవ్ నారాయణ్ యాదవ్- పబ్లిక్ ఏఫేర్స్-బీహార్
నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ
ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.
పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్ లాల్(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది.
పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో..
సునీల్ ఛెత్రి
యడ్లపల్లి వెంకటేశ్వరరావు
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ద్రోణవల్లి హారిక
ప్రభుదేవా
గౌతమ్ గంభీర్
శంకర్ మహదేవన్ నారాయణ్
శంతను నారాయణ్
రామస్వామి వెంకటస్వామి
దేవరపల్లి ప్రకాశ్‌రావు
అబ్దుల్ గఫార్ ఖాత్రి
గీతా మెహతా
రాజేశ్వర్ ఆచార్య
బంగారు ఆడిగలార్
ఎలియాస్ ఆలీ
మనోజ్ బాజ్‌పాయి
ఉద్ధబ్ కుమార్ భారాలి
ఉమేశ్ కుమార్ భారతి
ప్రితమ్ భరత్‌వాన్
జ్యోతి భట్
దిలీప్ చక్రవర్తి
మమ్మెన్ చాందీ
స్వపన్ చౌదరి
కన్వల్ సింగ్ చౌహాన్
దిన్‌యార్ కాంట్రాక్టర్
ముక్తాబెన్ పంకజ్‌కుమార్ దగ్లీ
బాబులాల్ దహియా
తంగా దర్లోంగ్
రాజకుమారి దేవి
భగీరథి దేవి
బల్‌దేవ్ సింగ్ ధిల్లాన్
గోదావరి దత్తా
గౌతమ్ గంభీర్
ద్రౌపది ఘిమిరే
రోహిణి గాడ్‌బోలే
సందీప్ గులేరియా
ప్రతాప్ సింగ్ హార్దియా
బులు ఇమామ్
ఫ్రెడిరైక్ ఇరినా
జోర్వార్‌సింగ్ జాదవ్
కన్వల్ సింగ్ చౌహాన్
ఎస్. జయశంకర్
నర్సింగ్ దేవ్ జమ్వాల్
ఫయాజ్ అహ్మద్ జాన్
కేజీ జయన్
సుభాష్ కక్
శరత్ కమల్
రజినీకాంత్
సుధామ్ కాటే
వామన్ కేండ్రే
ఖదీర్ ఖాన్
అబ్దుల్ గఫూర్ ఖత్రి
రవీంద్ర కోలే
స్మితా కొలే
బాంబేలా దేవి లాయిష్రం
కైలాష్ ఎం
రమేశ్ బాబాజీ మహారాజ్
వల్లభభాయ్ వస్రంభాయ్ మార్వానీయా
గీతా మెహతా
షాదబ్ మహమ్మద్
కె.కె. మహమ్మద్
శ్యాం ప్రసాద్ ముఖర్జీ
దైతరీ నాయక్
శాంతను నారాయణ్
దిన్‌యార్ కాంట్రాక్టర్
నర్తకి నటరాజ్
అనూప్ రంజన్ పాండే
జగదీష్ ప్రసాద్ పారిక్
గణపతిభాయ్ పటేల్
బిమల్ పటేల్
హుకుంచంద్ పాటిదార్
హర్విందర్ సింగ్
మధురై చిన్నా పిళ్ళై
కమలా పుజారి
జగత్ రామ
ఆర్.వి.రమణి
ప్రశాంతి సింగ్
సుల్తాన్ సింగ్
జ్యోతి కుమార్ సిన్హా
ఆనందన్ శివమణి
శారద శ్రీనివాసన్
దేవేంద్ర స్వరూప్
అజయ్ ఠాకూర్
రాజీవ్ తారానాథ్
సాలుమరద తిమ్మక్క
జమునా తుడు
భరత్ భూషణ్ త్యాగి
రామస్వామి వెంకటస్వామి
రామ్ శరణ్ వర్మ
స్వామి విష్ణుదానంద
హిరాలాల్ యాదవ్
దేవరపల్లి ప్రకాశ్‌రావు
అనూప్ సాహ్
నాగినిదాస్ సాంగ్వి
షబ్బీర్ సయ్యద్
మహేష్ శర్మ
మహమ్మద్ హనిఫ్ ఖాన్ శాస్త్రి
బ్రిజేష్ కుమార్ శుక్లా
నరేంద్ర సింగ్








