23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

- Advertisement -

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమన్న అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై 2 గంటలకుపైగా మంత్రులు చర్చించారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం అనంతరం భేటీలో చర్చించిన అంశాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు..

* అమరావతిలో భూ దందాపై న్యాయ నిపుణులతో చర్చ
* ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం
* సీఆర్‌డీఏలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు
* పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
* పంచాయితీరాజ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
* ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
* 108 అంబులెన్స్ సేవల్లో సమస్యల పరిష్కారం
* 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
* 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
* ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
* మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు. రూ.11,900 కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి. విభజన చట్టంలో భాగంగా రూ.10,900 కోట్లతో రామయపట్నం పోర్టు
* రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు
* జీఎన్ రావు, బీసీజీ నివేదికల పరిశీలనకు కమిటీ
* హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై నిర్ణయం

- Advertisement -