32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కార్యకర్తలకు పిలుపు

బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కార్యకర్తలకు పిలుపు

- Advertisement -

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

బోటు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

బోటు ప్రమాదం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కూడా స్పందించారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతవడం బాధాకరమని పవన్ అన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. అవసరమైన సాయం అందించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -