విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… జూన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ పూర్తై పోతుందని చెప్పిన ప్రభుత్వం… ఆ తర్వాత వచ్చే ఏడాది అని మాట మార్చిందని అన్నారు. దీని వెనుక వున్న కారణాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే 2020కి కూడా పోలవరం పూర్తవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. కుడికాల్వకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయని.. కానీ ఎడవ కాలువకు సంబంధించిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు.
చదవండి: బాబు పోలవరం టూర్ కి డుమ్మా కొట్టిన కీలక అధికారులు! కారణం ఏమిటి!
కేవీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?
అసలు పోలవరం నిర్మాణంలో చిన్న పొరబాటు జరిగిన…నష్టం ఊహించని రీతిలో ఉంటుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ న్తేయ కేవీపీ రామచంద్రరావు కేసుకు.. సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అది కేంద్రప్రభుత్వంపై వేసిన కేసని తెలిపారు.
రామచంద్రరావు కేసు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే మేలు జరుగుతుందని, కాంగ్రెస్, టీడీపీలు ప్రస్తుతం ఒక్కటైన నేపథ్యంలో కేవీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్‌ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఉండవల్లి మండిపడ్డారు.








