28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోట్ల ఫ్యామిలీ: ఆహ్వానించిన కేఈ

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోట్ల ఫ్యామిలీ: ఆహ్వానించిన కేఈ

kotla suryaprakash reddy-chandrababu
- Advertisement -

కర్నూలు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా, శనివారం తెలుగు దేశం పార్టీలో మాజీ కేంద్రమంత్రి కోట్ల కుటుంబం చేరింది. కర్నూలు జిల్లా కొడమూరు సభలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డిలకు చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డుమూరు మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్‌, కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్కసాగర లక్ష్మిరెడ్డి కూడా టీడీపీలో చేరారు.

సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. బీజేపీ కలిసి పనిచేస్తున్న వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని.. రైతుల కష్టాలు తీర్చే టీడీపీ అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఇది ఇలా ఉండగా, కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు వైసీపీకి రాజీనామా చేశారు. వీరు మార్చి 9వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.

చదవండి: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -