27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలోకి ఆళ్లగడ్డ టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి!

వైసీపీలోకి ఆళ్లగడ్డ టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి!

- Advertisement -

rampullareddy

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్నటివరకు వైసీపీ నేతలు టీడీపీ వలస వెళ్లారు. ఇక ఎప్పుడు టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూకట్టారు. మొన్న ఆమంచి, అవంతి శ్రీనివాస్, నిన్న జైరమేష్ వైసీపీ లోకి జాయిన్ అయ్యారు. ఇప్పటికే షాక్ లో ఉన్న టీడీపీకి తాజాగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.

మంత్రితో విబేధాలే కారణమా..

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌గా ఉన్నగతేడాది డిసెంబరు 28న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాంపుల్లారెడ్డి నేడు జగన్ తో భేటీ అయ్యి, జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండుకా క‌ప్పుకోనున్నారు. రాంపుల్లారెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు కూడా వైసీపీలో చేరుతున్నారు.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో భూమా వ‌ర్గానికి వ్య‌తిరేకులుగా రాంపుల్లారెడ్డి కుటుంబానికి పేరుంది. అఖిల ప్రియ విధానాల ప‌ట్ల విసిగిపోయి ఆయ‌న పార్టీ వీడుతున్న‌ట్టు చెబుతున్నారు. ఈయన గతంలో మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసాడు. టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఏదేమైనా ఒక్కొక్కరుగా టీడీపీ ని వీడటానికి సిద్దమౌతుండటంతో ఏమి చేయాలో తెలియక టీడీపీ అధినేత తలపట్టుకుంటున్నాడు.

చదవండి : టీడీపీకి మరో షాక్: జగన్మోహన్ రెడ్డిని కలిసిన జై రమేష్, ఆ సీటు కోసమేనా?

- Advertisement -