దేవరహస్యం: మనిషికి ప్రాణం పోసే ‘దైవకణం’.. మిస్టరీ వీడుతుందా?

god-particle
- Advertisement -

cern-lhc-expirement

ముందుగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కిందట.. విశ్వంలో  ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. అప్పుడు గ్రహాలన్నీ చెల్లా చెదురుగా ఎక్కడెక్కడో పడిపోయాయట..ఆ సమయంలో భూమితో పాటు గాలి, నీరు, సూర్యుడు (అగ్ని), ఆకాశం.. ఇలా పంచభూతాలుగా చెప్పుకునే ఈ ఐదు కలిసి ఒక దగ్గర కేంద్రీకృతమై.. ఈ భూమి అనే గ్రహంగా అవతరించింది.

ఈ ఐదు ఏవైతే ఉన్నాయో..  1. భూమి 2. ఆకాశం 3. నీరు 4. గాలి 5 అగ్ని.. ఇవన్నీ కలిసి ఒక అందమైన ప్రకృతిగా అవతరించింది. ఇక్కడే  సృష్టి కార్యం మొదలైంది. ఈ ఐదింటితోనే (మానవులతో కలిపి) అన్ని జీవరాశులు ఉద్భవించాయి.

అందరూ అనే మాట.. ఆత్మ.  అసలు మనిషిలో ఇమిడి ఉన్న ఆత్మ ఎక్కడిదో కాదు.. ఈ ప్రకృతిలోనే  ఇమిడి ఉంది. అంటే పంచభూతాలలో కలిసిపోయి ఉన్నదే.  ఎన్నో వేల సంవత్సరాల కిందటి మాట ఇది.. వేద వాజ్మయంలో ఈ పంచభూతాల ప్రస్తావన ఉంది.

కానీ ఆ కాలంలో వీటిపై వివరణలు, అధ్యయనాలు లేవు. అయితే విజ్ఞాన శాస్త్రం (సైన్స్) అందుబాటులోకి వచ్చాక వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ ఆత్మ ఎక్కడ నుంచి వస్తుందో మళ్లీ అక్కడికే వెళ్లిపోతుంది.

భూమి అంటే అన్నీ ఘన పదార్థాలతో భూ తత్వం కలిగి ఉంటాయి.. జాలం అంటే అన్నీ ద్రవ పదార్థాలు జల తత్వం కలిగి ఉన్నాయని అర్థం… వాయు అంటే వాయు పదార్థాలు వాయు తత్వం కలిగి ఉన్నాయి.. అగ్ని అంటే ఉష్ణం.. ఆకాశం అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ అంటారు.

భూమ్మీద చిన్న నీటి మడుగులో ఒక విత్తనం బయలుదేరి అక్కడ ఒక చిన్న మొక్క మొలిచింది. ఆ మొక్క నుంచి మరికొన్ని విత్తనాలు..అలా పది మొక్కలు, అవి వంద అలా..అలా..లక్షల మొక్కలు పుట్టాయి.. అలా కొన్నేళ్లలో అవన్నీ అడవులుగా మారాయి.

అలా ఒక విత్తనం నుంచి మొక్క పుట్టినట్టే.. మరో ప్రకృతి ఆత్మ రకరకాల ఆకృతుల్లో బయలుదేరింది. అలా కొన్ని లక్షల జీవరాశులు భూమ్మీద నడయాడాయి.

అందులో పులి ఉంది..నక్క ఉంది..పాము ఉంది..డైనోసార్ ఉంది..కప్ప, చీమ, తేలు, బల్లి, దోమ కొన్ని లక్షల జీవరాశులు బయలుదేరాయి.. చెట్లు, పుట్టలు, రకరకాల ఎంతో అందమైన పువ్వులు, వివిధ రుచికరమైన పండ్లు, కాయలు..ఇంకా వివిధ రకాల కాయగూరలు ఇలా ఎన్నో..అందుకనే..

ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని సొగసులిచ్చాడు.. అన్నిటిలో నన్నే చూడమన్నాడు..’  ఇది ‘రాజారమేష్’ సినిమాలో పాట.

ఇప్పుడు ఇంత అందంగా తయారైన ప్రకృతి నుంచి.. ఒక అందమైన జీవి ఉద్భవించింది. ఒక కుటుంబంలో వందమంది ఉంటారు..అందులో ఒకరిపై అందరికి ప్రత్యేకమైన  ప్రేమ, అభిమానం ఉంది.

అలాగే ఈ ప్రకృతి మాతకు జన్మించిన ఆ అందమైన జీవిపై అపరిమితమైన ప్రేమ.. (ఒక అందమైన అమ్మాయి అనుకుందాం) అలా తనని అపురూపంగా చూసుకుంటూ ఉండగా. ఆమెకు ఒక తోడు కావాలి అనిపించి.. అలా అమ్మాయికి.. ఒక అబ్బాయిని తీసుకువచ్చి కలిపింది.  అలా సృష్టికి..  ప్రతి సృష్టి జరిగింది..

ఆత్మ..ఆత్మ..ఆత్మ.. అంటుంటారు.. ఆ ఆత్మ ఉందో లేదో తెలీదుగానీ.. ప్రకృతిలో ఒక శక్తి మాత్రం ఉంది. ఆ శక్తిని చాలామంది భగవంతుడిగా కీర్తించడం మొదలుపెట్టారు.  మనిషి ఫుట్టుక ఇప్పటికి సైన్స్ కి అందని ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న..

అంటే తల్లి గర్భంలో ఒక శిశువు 9 నెలలు స్తబ్థుగా ఉండి.. ఈ భూమ్మీదకు వచ్చే క్షణంలో సడన్ గా ఒక స్పార్క్ వస్తుంది. అది భూమ్మీద ఆ జీవి నడయాడటానికి..  ఆ జీవి శరీరంలో చేరుతుంది. అది భూమ్మీద ఏ జీవరాశికైనా ఒకటే.. ఆ‘ప్రాణం’ పోసుకోవడం.. ఇప్పటికి  కొందరు కనిపెట్టినా.. అది చాలా ప్రమాదమని కొందరు పేర్కొంటున్నారు.

ఇంతకీ మనిషికి ప్రాణం పోసే ఆ కణం పేరు … ‘దైవ కణం’ (హిగ్స్ బోసన్)..

ఆ పరిశోధనలు చేస్తే ముప్పు తప్పదు..

ఈ అనంత విశ్వంలో ద్రవ్యరాశి, ఆకారం, పరిణామాలే కారణమని భావిస్తున్న ‘దైవకణం’ కోసం..ఆ రహస్యాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే ద్రవ్యరాశి, ఆకారానికి మూల కారణమైన ఆ దైవకణం జోలికి వెళ్లవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు కూడా..

పదార్థం, అణువులు, కణాలపై లోతైన అధ్యయనాలు ఇంకా జరుగుతున్నాయి. అయితే అత్యధిక శక్తి వద్ద ఈ దైవకణం తన స్థిరత్వాన్ని కోల్పోతుందని.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్వర్గీయ స్టీఫెన్ హాకింగ్  చెబుతున్నాడు. ఇంకో మాటేమిటంటే..దాని జోలికి వెళితే.. విశ్వ నాశనం తప్పదని పేర్కొంటున్నాడు.

అలాగే మరికొన్ని సైడ్ ఎఫెక్టులు ఉంటాయని, మనిషికి ప్రాణం పోసే శక్తి వస్తే.. డబ్బులున్నవాళ్లు..అలాగే వందల ఏళ్ల ఆయుష్షు పెంచుకుంటూ గడిపేస్తారని..అప్పుడు సృష్టి లక్ష్యం గతి తప్పుతుందని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా పుట్టిన జీవి.. మరణించక తప్పదు..దానినలాగే కొనసాగిస్తే..కొన్నాళ్లకు ఈ భూమండలం సరిపోదని, మనుషులతో నిండిపోతుందని తెలిపాడు.

ఎందుకంటే అంతమందికి కావల్సిన ఆహార ధాన్యాలు ఉండవని, నిలుచునేందుకు కూడా జాగా ఉండదని చెబుతున్నారు. అయితే భగవద్గీతలో చెప్పినట్టు.. పుట్టేవాడు పుడుతుంటాడు..అయితే  వెళ్లేవాడు  మాత్రం వెళ్లడు.. అఫ్పడు సృష్టి గతి లయ తప్పుతుందని చెబుతున్నాడు..

ఇందులో ముఖ్యంగా ‘విశ్వం, కాలం’ అనే రెండూ కీలక శక్తులు సర్వనాశనమవుతాయని పేర్కొన్నాడు. ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయాలతో రాసిన ’స్టార్మప్‘ అనే పుస్తకంలో స్టీఫెన్ హాకింగ్ ముందు మాటలో.. పై విషయాలన్నీ తెలిపాడు.

వంద బిలియన్ గిగా ఎలక్ట్రానిక్ ఓల్టుల శక్తి..

వంద బిలియన్ గిగా ఎలక్ట్రానిక్ ఓల్టుల శక్తితో.. విశ్వంలో గాలి బుడగలా ఈ దైవకణం తిరుగుతుందని..మనం పరిశోధనల పేరుతో వెళ్లి.. ఆ గాలి బుడగను పిన్నీసుతో గుచ్చుతుంటే.. అదెప్పుడో ఒకసారి పేలిపోవడం ఖాయమని  ఆ పుస్తకంలో శాస్త్రజ్ణులు తెలిపారు.

సెర్న్ శాస్త్రవేత్తల బృందం 2012లో ఈ దైవకణం ఉనికిని కనుగొందని చెబుతున్నారు. అయితే ఈ దైవకణం అన్వేషణలో భారతదేశానికి చెందిన సత్యేంద్రనాథ్ బోస్ విశేష కృషి చేశారు. అందుకనే వారు కనిపెట్టిన  ఆ దైవ కణం పేరులో బోసన్ అనే పదం కూడా చేర్చినట్లుగా చెబుతారు.

వద్దని ప్రఖ్యాత సైంటిస్టులే చెబుతుంటే..

ఎందుకు? అది కనిపెట్టి ఉపయోగం ఏమిటి? ముందు బట్టబుర్రకి వెంట్రుకలు వచ్చే మందు కనిపెట్టండి.. తర్వాత దైవకణం జోలికి వెళుదురుగానీ.. అని పలువురు సెటైర్లు కూడా వేస్తున్నారు.

ఒకవేళ కనిపెట్టి ప్రయోగించినా.. హాలివుడ్ సినిమాల్లో చూపించినట్టు లేదా తెలుగులో ‘ఐ’ పేరుతో వచ్చిన విక్రమ్ సినిమాలో తయారైనట్టు వికృతంగా జీవి తయారై..వాడు సమాజానికి హానికరంగా, ప్రమాదకారిగా మారే అవకాశాలున్నాయని.. అందుకే అటువంటి  వాటి జోలికి వెళ్లవద్దని ప్రపంచమంతా.. ఈ సైంటిస్టులని కోరుతోంది.

ఒక జర్నీగా భావిస్తే చాలు…

ఇప్పుడు అందరూ ఆ ప్రకృతిలో శక్తిని భగవంతుడిగా కొలుస్తున్నారు. అలా ఆ భగవంతుడిచ్చిన అందమైన జీవితాన్ని అనుభవించి, ఆనందించి, ఆస్వాదించి, ఆయురారోగ్యాలతో ఉండకుండా.. ఎందుకీ తలనొప్పులని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు.

మీరు ఒక  ఊరు వెళదామని అనుకుంటున్నారు. ముందు రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరుతారు. ఆ ట్రైన్ ఎక్కుతారు. చక్కగా జర్నీ చేసి.. మీరెక్కడ దిగాలో అక్కడ దిగి వెళ్లిపోతారు. అంతేకానీ ఆ ట్రైన్ లోనే ఉండిపోవాలని అనుకోరు కదా.. ఇది కూడా అంతే..

ఈ భూమ్మీదకు మీరొక జర్నీ చేయడానికి వచ్చారు. అక్కడ కనీసం మీరు బట్టలైనా పట్టకెళతారు. ఇక్కడలాంటివేవీ ఉండవు..ఏమీ లేకుండానే వస్తారు. అందుకే ఎందుకీ కోపతాపాలు, ఆవేశాలు, కొట్లాటలు, చంపుకోవడాలు.. అరుసుకోవడాలు.. ఆ ట్రైన్ జర్నీని ఎలా ఆస్వాదిస్తామో.. ఈ భూమ్మీద జర్నీని అలాగే ఆస్వాదించాలి..తెచ్చేది ఉండదు.. తీసుకుపోయేది ఉండదు..

హాయిగా ఆ పాటల రచయిత చెప్పినట్టు.. ‘ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని సొగసులిచ్చాడు.. అన్నిటిలో నన్నే చూడమన్నాడు.. అలా కనిపించే అన్నింటిని చూసి ఆనందిస్తూ.. ఆ భగవద్ధర్శనం చేసుకుంటూ హ్యపీగా గడిపేయండి..నమస్తే..

-శ్రీనివాస్ మిర్తిపాటి

 

- Advertisement -