దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న ‘కరోనా’! మహారాష్ట్రలో విజృంభిస్తున్న వైరస్?

- Advertisement -

ముంబై: దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. నిన్నమొన్నటి వరకు నెమ్మదించిన మహ్మమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక, మహారాష్ట్రలో అయితే వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది.

రాష్ట్రంలో ఈ రోజు ఒక్క రోజే 2,701 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి.

మొత్తం కేసుల్లో 1,765 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, మంగళవారం 1,881 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతోన్న పాజిటివ్ కేసులు…

నిన్నటితో పోలిస్తే నేడు 81 శాతం ఎక్కువగా కేసులు నమోదు కావడం గమనార్హం. మంగళవారం నమోదైన కేసుల్లో ఒకటి బి.ఎ.5 వేరియంట్ (B.A.5 Variant) కేసు నమోదైంది.

దేశవ్యాప్తంగా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. బుధవారం ఏకంగా 5,233 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని క్రియాశీల కేసుల సంఖ్య 28,857కు పెరిగింది.

93 రోజుల తర్వాత దేశంలో తొలిసారి 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,90,282కు పెరిగింది.

చదవండి: China: లాక్‌డౌన్ ఆంక్షల దిగ్బంధనంలో చైనా నగరాలు.. షాంఘైలో ఒక్కరోజులో 51 మరణాలు…
- Advertisement -