నాకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి: కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

హైదరాబాద్: తనకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ కీర్తి సురేష్.

ఇటీవల నితిన్ కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా  ‘రంగ్ దే’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తన పెళ్లి గురించి నెట్టింట్లో పుకార్లు చాలాకాలంగా హల్‌చల్ చేస్తున్నాయని, మొదట్లో అలాంటి వార్తలు చూసినప్పుడు ఎంతో షాక్ అయ్యేదానినని, బాధపడేదానినని చెప్పారు.

‘‘అందరికీ చెప్పే చేసుకుంటా..’’ 

తన పెళ్లిని సోషల్ మీడియాలో నెటిజన్లు చేయడం ఏమిటో ఇప్పటికీ తనకు అర్థం కాదని, అయితే నిజమైన తన పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.

సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను వివాహ బంధంలోకి అడుగుపెడతానని, అందరికీ చెప్పే చేసుకుంటానని, ఈలోగా మరిన్ని పెళ్లిళ్లు తనకు చేయవద్దంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ‘రంగ్ ‌దే’ సినిమా ఇటీవలై విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కూడా కీర్తి ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తోంది.

 

- Advertisement -