చంద్రబాబుతో నేనే మాట్లాడా ప్రయోజనం లేదు: మోహన్ బాబు

mohanbabu comments on cm chandrababinaidu
- Advertisement -

హైదరాబాద్‌: ఎన్టీఆర్ మరణించిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదని సినీ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు అన్నారు. ఎంపీనో, ఎమ్మెల్యేనో కావాలనుకుంటే మూడేళ్ల క్రితమే జగన్ కు మద్దతిచ్చేవాడినని అయన చెప్పుకొచ్చాడు.

ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నది తమ శ్రీ విద్యానికేతనే అని తెలిపారు. తన ఫిక్స్ డు డిపాజిట్లను కూడా బ్రేక్ చేసి డబ్బు తెచ్చి ఇచ్చానని చెప్పారు. ఏపీలో తమ విద్యాసంస్థే నంబర్ వన్ అని అన్నారు. అన్ని పార్టీల్లో ఉండే తల్లిదండ్రుల బిడ్డల తమ విద్యాలయాల్లో చదువుతున్నారని చెప్పారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కింత తమకు రూ. 19 కోట్ల బకాయిలు రావాలని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశామని, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో కూడా మాట్లాడని, అయినా ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు.

చదవండి : బాబుకి బిగ్ షాక్! వైసీపీలోకి మోహన్ బాబు..రేపటినుండి ప్రచారం!

- Advertisement -