ప్రో కబడ్డీ లీగ్‌ 2018: బెంగాల్ వారియర్స్‌పై పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్‌, మరో మ్యాచ్‌లో యు ముంబా…

bengal warriors beat telugu titans in pro kabaddi league 2018
- Advertisement -

bengal warriors beat telugu titans in pro kabaddi league 2018

ముంబై: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్‌-6లో తెలుగు టైటాన్స్‌ మూడో ఓటమిని మూటగట్టుకుంది. జోన్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 25-30 స్కోరుతో తెలుగు టైటాన్స్‌ ఓటమిపాలైంది.

తెలుగు టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8 పాయింట్లతో సత్తా చాటినా కూడా తన జట్టును గెలిపించలేకపోయాడు. ట్యాక్లింగ్‌లో ఫర్హద్‌ 5 పాయింట్లతో రాణించాడు. ఇక బెంగాల్‌ వారియర్స్‌ జట్టులో డిఫెండర్‌లు బల్‌దేవ్‌, సుర్జిత్‌ సింగ్‌ అద్భుతంగా రాణించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు.

అంతకుముందు.. ప్రో కబడ్డీ లీగ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా జట్టు 48-24 స్కోరుతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.

ప్రో కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగే మ్యాచ్‌లు…

పాట్నా పైరేట్స్‌  x  బెంగాల్‌ వారియర్స్

యు ముంబా x  గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌

 

 

ముంబై:

- Advertisement -