ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజాను కీలక పదవిలో నియమించిన వైఎస్ జగన్

mla-roja-cm-jagan
- Advertisement -

అమరావతి: వైఎస్సార్సీపీ గనుక అధికారంలోకి వస్తే… ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే… వైసీపీ నిజంగానే అధికారంలోకి వచ్చినా.. రోజాకి మాత్రం ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు.

చదవండి: కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?

ఒక దశలో తనకు ఏ పదవీ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే రోజా సైతం బాధపడ్డారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే… కేవలం కుల సమీకరణాల కారణంగానే ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్లు సీఎం జగన్ ఆమెకు నచ్చచెప్పారు. కానీ త్వరలోనే ఆమెకు మరో కీలక పదవి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఏపీ ప్రభుత్వంలో రోజాకు కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్‌గా ఆమెని నియమించారాయన. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

టీటీడీ స్పెషలాఫీసర్‌గా ధర్మారెడ్డి…

అదే సమయంలో.. కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఏవీ ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు వైఎస్ జగన్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…

ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌కు చెందిన ధర్మారెడ్డి గతంలో టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ధర్మారెడ్డి బుధవారం వరకు కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆయన టీటీడీ స్పెషలాఫీసర్‌గా నియమితులయ్యారు.

- Advertisement -