ఘోర ప్రమాదం: 10 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు సజీవదహనం! నిద్రలోనే పోయిన ప్రాణాలు…

fire accident in Arpit Palace

brezill foot players dead on fire accident

రియో డీ జెనిరో: బ్రెజిల్‌లో అత్యంత మహా విషాదం చోటు చేసుకుంది. రియో డీ జెనిరోలోని ఫ్లెమెంగో అనే ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో రాత్రిపూట మంటలు చెలరేగడంతో, 10మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ నిద్రలోనే సజీవ దహనమయ్యారు. వీరంతా టీనేజర్సే కావడం గమనార్హం. ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రభుత్వం పై విమర్శల వెల్లువ…

ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్‌పై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిజానికి ఆటగాళ్లు నిద్రించిన ఆ ప్రదేశాన్ని కారు పార్కింగ్ కోసం కేటాయించారని తెలుస్తోంది. అలాంటి చోట ఆటగాళ్లకు బస ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై స్పందించిన ఫెలిప్ కార్డోసో అనే ఫుట్‌బాల్ ప్లేయర్, రాత్రిపూట ఓ ఎయిర్ కండిషనర్ నుంచి మొదట మంటలు చెలరేగినట్టు చెప్పాడు.

దాంతో తాను బయటకు పరుగులు తీశానని.. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డానని అన్నాడు. కాగా, ఫ్లెమింగో క్లబ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌గా పేరు ఉంది. క్లబ్ 123ఏళ్ల చరిత్రలో ఇంతటి విషాదకర ఘటన ఎన్నడూ చోటు చేసుకోలేదని అధికారులు అంటున్నారు. మృతుల కుటుంబాలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.