కోహ్లీ వన్డేల్లో 80 సెంచరీలు చేస్తాడు: వసీం జాఫర్

7:19 pm, Mon, 12 August 19

న్యూఢిల్లీ: టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వన్డేల్లో కనీసం 75-80 సెంచరీలు చేస్తాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ బాదాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ శతకం. విరాట్ శతకం పూర్తి చేసుకున్న వెంటనే జాఫర్ ట్వీట్ చేశాడు.
11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ మళ్లీ బ్యాట్ ఝళిపించాడని, తన అంచనా ప్రకారం.. విరాట్ తన కెరియర్‌లో వన్డేల్లో 75 నుంచి 80 సెంచరీలు నమోదు చేస్తాడని పేర్కొన్నాడు. భారత్ తరపున 31 టెస్టులు ఆడిన వసీం జాఫర్ టెస్టులో మంచి ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన కెరియర్‌లో రెండు టెస్టు సెంచరీలు, 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేశాడు.