వరల్డ్ కప్‌లో పాల్గొనే ఇండియా జట్టు ఇదే….

10:17 pm, Mon, 20 May 19
bcci-announces-team-india-for-world-cup-2019

ముంబై: మే30 న మొదలయ్యే క్రికెట్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే కొన్నిరోజుల క్రితమే 15 మందితో జట్టును ఎంపిక చేసినా బీసీసీఐ…తరవాత  అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లని స్టాండ్ బై ఆటగాళ్లగా ఎంపిక చేసింది.

ఇక ఐపీఎల్ సందర్భంగా కేదార్ జాదవ్ గాయపడ్డాడు. దీంతో రాయుడుకు అవకాశం దక్కుతుందని అనుకున్నారు. అకని జాదవ్  ఫిట్ నెస్ సాధించడంతో తన స్థానం నిలుపుకున్నాడు. దీంతో రాయుడుకి అవకాశం దక్కలేదు. అంతక ముందు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లతోనే తుది జట్టుని ప్రకటించారు.

ప్రపంచకప్ లో ఆడే భారత జట్టు ఇదే…

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్.

చదవండి: వరల్డ్ కప్: ఆస్ట్రేలియానే ఫేవరెట్ అంటున్న గంభీర్…