శ్రీశాంత్‌ పై నిషేధం ఎత్తివేసిన సుప్రీం కోర్టు..

11:16 am, Fri, 15 March 19
Supreme Court lifts ban on Sreesanth, Newsxpressonline

న్యూఢిల్లీ: టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడినందుకుగాను బీసీసీఐ అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తువేస్తూ.. సుప్రీం తీర్పు వెలువరించింది.

ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడా..

జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ కేసును విచారించి బెంచీ అతనిపై నిషేధం విషయంలో మూడు నెలల్లోగా తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా బెంచీ అభివర్ణించింది.

కాగా, 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతూ పట్టుబడ్డాడు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. అంతేకాక.. ఇటీవల హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న శ్రీశాంత్ ఆ సీజన్ రన్నర్ అప్‌గా నిలిచాడు