సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు నేటికి ఏడేళ్లు!

Sachin Tendulkar's seven-years record, Newsxpressonline

ఇండియా: 2012, మార్చి 16 , వేదిక బంగ్లాదేశ్‌లో మీర్‌పూర్… ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ క్రీజులో ఉన్నాడు.

అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ. సచిన్ సెంచరీ పూర్తి చేస్తాడా? లేదా? ఎందుకంటే ఆసియాకప్‌లో బరిలో దిగడానికి ముందు 99 అంతర్జాతీయ శతకాలతో ఉన్నాడు సచిన్.

100 సెంచరీల వీరుడు..

99 సెంచరీ చేసి 32 ఇన్నింగ్స్‌లు అయినా నూరో శతకాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మరోసారి సెంచరీ మిస్ అవుతాడేమో.. అనే సందేహం. ఈసారైనా సెంచరీ చేస్తాడా లేదా? అనే అనుమానం.

సచిన్ సెంచరీ కోసం ఎదురుచూస్తూ కొద్దిసేపు యావత్ భారతం స్థంభించిపోయింది. 102 బంతుల్లో 80 పరుగులు చేసిన సచిన్, మిగిలిన 20 పరుగులు చేసేందుకు ఏకంగా 36 బంతులను ఎదుర్కొన్నాడు.