విండీస్‌తో డేంజరే: రవి శాస్త్రి

10:45 am, Wed, 15 May 19

ఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ మే30 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీకి భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి తెలిపారు. కప్ గెలిచేందుకు తమ దగ్గర మంచి ఆయుధాలే ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉంటే వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల గురించి రవి శాస్త్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విండీస్‌ జట్టు భారత్‌ టూర్‌కు వచ్చినప్పుడు వారిపై గెలిచి ఉండొచ్చని,  కానీ ఆ సిరీస్‌ కఠినంగా సాగిందని తెలిపాడు.

చదవండిసియట్ అవార్డులు: బెస్ట్ క్రికెటర్‌, బెస్ట్ బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ.. ‘బెస్ట్ బౌలర్’గా బుమ్రా…

అప్పుడు గేల్‌, రస్సెల్‌ లేకపోయినా వారు అద్భుతంగా ఆడారని, ఇప్పుడు వారిద్దరూ జట్టులోకి వచ్చారని, కరీబియన్ల హిట్టింగ్‌ ముందు ఏ జట్టూ సరిపోదని చెప్పాడు.

ఇక 25 ఏళ్ల లో ఆసీస్‌ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిందని, తాజాగా ఆ జట్టు డిఫెండింగ్‌ చాంప్‌ హోదాలో బరిలోకి దిగుతోందని, ఇప్పుడు ప్రధాన ఆటగాళ్లంతా జట్టులోకి రావడంతో పాటు వాళ్లంతా ఫామ్‌లోనే ఉన్నారని రవిశాస్ర్తి గుర్తుచేశాడు.

చదవండి: గ్రేట్: మోకాలు రక్తమోడుతున్నా ఆట మాత్రం ఆపలేదు! చెన్నై కోసం చివరిదాకా పోరాడిన వాట్సన్…