ప్రపంచ కప్: ఇంగ్లండ్‌కి భారీగా చేరుకుంటున్న భారత్ అభిమానులు….

11:01 am, Fri, 10 May 19

ఢిల్లీ: మే 30 నుంచి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్ని మొదలు కానున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నరపాటు జరిగే ఈ క్రికెట్‌ సంబరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఛలో లండన్‌ అంటున్నారు.

ఇక భారత జట్టు ఆడే మ్యాచుల్లో భారీసంఖ్యలో భారత అభిమానులతో ఇంగ్లాండ్‌ మైదానాలు నిండిపోనున్నాయి. ఈ సారి ఇంగ్లాండ్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు దాదాపు 80,000 మంది భారత అభిమానులు తరలివెళ్లనున్నట్లు సమాచారం.

చదవండిక్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసి ఫైనల్‌కి చేరిన ముంబై…..

భారత్‌-ఇంగ్లాండ్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌, భారత్‌లోని ట్రావెల్‌ ఏజెన్సీలు ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఈ లెక్కలు తేలాయి. ఇక ఇంగ్లండ్‌లో ఉన్న భారత్ అభిమానులు అదనం. అటు మిగిలిన జట్ల అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. అయితే వారితో పోలిస్తే భారత అభిమానులే అధికం.

భారత్ షెడ్యూల్…

వరల్డ్ కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికాని ఢీకొట్టనుంది. అలాగే జూన్ 9న ఆస్ట్రేలియాతో, 13న న్యూజిలాండ్, 16న పాకిస్తాన్, 22న అఫ్గానిస్తాన్, 27న విండీస్, 30న ఇంగ్లండ్, జూలై 2న బంగ్లాదేశ్, జూలై 6న శ్రీలంకతో తలపడనుంది.

చదవండి: క్వాలిఫైయర్-2: గెలిచేదెవరు….? ఫైనల్‌లో నిలిచేదెవరు?