ముంబై చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌కతా….ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న హైదరాబాద్….

Mumbai Indians crush KKR and take SRH along to playoffs
- Advertisement -

ముంబై: ప్లే ఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చతికలపడింది. ఆదివారం రాత్రి ముంబైతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా ఘోరపరాజయం పాలైంది.

మొదట చెత్త బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో క్రిస్ లిన్ 29 బంతుల్లో 41 ధనాధన్ ఆటతో అలరిస్తే.. రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 40 టెస్టు మ్యాచ్‌ను తలపించాడు. ఇక వీరిద్దరు తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కి పరిమితమయ్యారు.

ఇక ముంబై బౌలర్లో మలింగ (3/35), హార్దిక్ (2/20), బుమ్రా (2/31) విజృంభించారు.  అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 16.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ( 55 నాటౌట్), సూర్యకుమార్ (46 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌లతో అలరించారు. హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో రోహిత్ సేన పట్టికలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ఇక చెన్నై రెండో స్థానంలో ఉండగా…ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఇక కోల్‌కతా ఓడిపోవడంతో మెరుగైన రన్ రేట్ ఉండటంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్….

క్వాలిఫయర్-1-మే 7

ముంబై X చెన్నై , వేదిక: చెన్నై

ఎలిమినేటర్ మే 8

ఢిల్లీ X హైదరాబాద్, వేదిక: విశాఖపట్నం

క్వాలిఫయర్-2 మే 10

క్వాలిఫయర్ -1 పరాజిత X ఎలిమినేటర్ విజేత (విశాఖపట్నం)

ఫైనల్ మే 12:

క్వాలిఫయర్ -1 విజేత X క్వాలిఫయర్-2 విజేత(హైదరాబాద్)

చదవండి:ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఓటమి.. ప్లే ఆఫ్స్ చేరిన ముంబై!

 

- Advertisement -