బీజేపీలోకి కోమటిరెడ్డి?

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఎదిగేందుకు చూస్తున్న బీజేపీలోకి కాంగ్రెస్ పెద్ద నేతలు చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…..కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి రాష్ట్ర నాయకత్వమే కారణమని విరుచుకుపడ్డారు.

తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి కుంతియాపై మండిపడ్డారు. ఇక కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ఫిక్సయ్యారని..అందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

కాగా, త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. టీఆర్ఎస్ సహా పలువురు నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయా పార్టీల నేతలు తమ పార్టీలో చేరికలకు ముందు వారు రాజీనామాలు చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

చదవండి: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….
- Advertisement -