ధోని సిక్స్ .. కోహ్లీ ఖుష్… బెస్ట్ మోమొంట్!!

3:16 pm, Mon, 10 June 19

హైదరాబాద్: నిన్న ఓవల్ వేదికగా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ధోని కొద్దిసేపే ఆడిన తనదైన బ్యాటింగ్ శైలి తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ధోని భారీ
సిక్స్ కొట్టాడు.

చదవండి: ధోనీతో పాటు..గేల్‌కి షాకిచ్చిన ఐసీసీ..

143 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతిని ధోని సిక్సర్ గా మలిచిన తీరును చూసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కోహ్లీ ఆశ్చర్య పోయాడు. తేరుకున్న కోహ్లీ నవ్వుతూ వచ్చి ధోనిని అభినందించాడు. ఆ సన్నివేశం చూస్తే వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంతటిదో అర్థమవుతుంది. కోహ్లితో పాటు ప్రేక్షకులు కూడా ఆ సిక్స్ ని ఎంతో ఎంజాయ్ చేశారు.

ఇలా ఎన్నోసార్లు ధోని తనదైన బ్యాటింగ్ శైలి తో ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. కోహ్లీ కూడా స్టార్క్ బౌలింగ్లో లో సూపర్ సిక్స్ కొట్టాడు. ఇన్సైడ్ ఔట్ స్టాండ్ తో ఎక్స్ట్రా కవర్ మీదుగా
సిక్స్ కొట్టాడు.

ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఇండియా 36 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉంది.