ఆ జట్టు తలుచుకుంటే 500 స్కోరు సాధ్యమే: కోహ్లీ

10:42 am, Sat, 25 May 19

ఇంగ్లండ్: మరో ఐదు రోజుల్లో వన్డే క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీసీ 10 జట్ల కెప్టెన్లతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ…. ఈ సారి వరల్డ్ కప్‌లో రికార్డు స్కోర్లు నమోదు కావచ్చని అంచనా వేశాడు. ఇక ప్రపంచకప్ 2019లో 500 మార్క్ దాటడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నకి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ… ఇంగ్లండ్ ప్లేయర్లు తలుచుకుంటే 500 స్కోరు కచ్ఛితంగా సాధ్యమేనని, అందరి కంటే ముందు 500 కొట్టాలనే తపన, తాపత్రయం వారిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.

అలాగే ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపాడు. అందులో ఆధిక్యం కోల్పోయినా, సిరీస్‌ను ఎలా చేజిక్కించుకోవాలో ఆసీస్ నేర్పిందని అన్నారు.

ఇక ప్రపంచకప్‌లో ఏ జట్టుతో ఆడినా… ఆసీస్‌లా ఆడాలని, వారిలా ఆట పట్ల మోజుతో, అంకితభావంతో ఆడాలని వ్యాఖ్యానించాడు. పాక్‌తో మ్యాచ్ అన్ని మ్యాచుల్లాగే ఓ రెగ్యూలర్ మ్యాచ్ అంటూ దాయాదిపై పోరులో ప్రత్యేకత లేదని కొట్టిపారేశాడు.

చదవండివన్డే ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాళ్లు లేరు: రవిశాస్త్రి