అరుదైన ఘనత సొంతం చేసుకున్న కోహ్లీ…

9:51 am, Sat, 18 May 19
I can not say who is the greatest of both. Kohli is doing the job, Newsxpressonline

ముంబై: క్రికెట్‌లో అన్నీ ఫార్మాట్లలో దుమ్మురేపుతున్న టీం ఇండియా రథసారథి విరాట్ కోహ్లీ…మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. అయితే అది క్రికెట్‌లో కాదు…సోషల్ మీడియాలో.. సోషల్‌మీడియాలో 100 మిలియన్ ఫాలొవర్లు ఉన్న తొలి ఇండియన్ క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు.

ఫేస్‌బుక్‌లో 37.1 మిలియన్, ట్విట్టర్‌లో 29.4 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 33.5 మిలియన్ల మంది విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నారు. మొత్తం మీద 100 మిలియన్ల ఫాలోవర్స్‌తో రికార్డు సృష్టించాడు. ఇక సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీకి కూడా ఈ ఘనత సాధించలేదు.

చదవండి: విండీస్‌తో డేంజరే: రవి శాస్త్రి

ఐపీఎల్ ముగియడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. ఐసీసీ ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాడు.  మే 30 నుంచి వరల్డ్ కప్ మొదలు కానుంది. జూన్ 5వ తేదీన సౌతాంప్టన్ వేదికగా టీం ఇండియా తొలి మ్యాచ్‌ సౌతాఫ్రికాతో ఆడనుంది.

అంతకంటే ముందు ఈ నెల 25 న భారత్ న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఇండియా 1983, 2011లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అయితే ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన ఆరాటపడుతోంది.

చదవండివరల్డ్ కప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?