సియట్ అవార్డులు: బెస్ట్ క్రికెటర్‌, బెస్ట్ బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ.. ‘బెస్ట్ బౌలర్’గా బుమ్రా…

9:24 pm, Tue, 14 May 19
1

ముంబై: టీమిండియా రథ సారథి విరాట్ కోహ్లీ… మరో ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక సంస్థ ‘సియట్’ ప్రకటించిన క్రికెట్ అవార్డుల్లో.. ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్‌, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ అవార్డులని కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

ఇక భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు ఇంటర్నేషనల్ బెస్ట్ బౌలర్‌గా అవార్డు దక్కింది. అలాగే ఛతేశ్వర్ పూజారా బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక కాగా, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది.

అటు మహిళా క్రికెటర్లలో స్మృతి మందనకు ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కడం విశేషం.  కాగా, గత నెలలో ప్రకటించిన విజ్డన్ అవార్డుల్లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌-2019గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. కోహ్లీ ఖాతాలో వరుసగా మూడో ఏడాది ఈ అవార్డు చేరడం విశేషం.

చదవండిగ్రేట్: మోకాలు రక్తమోడుతున్నా ఆట మాత్రం ఆపలేదు! చెన్నై కోసం చివరిదాకా పోరాడిన వాట్సన్…
చదవండి:ఒక రీప్లేలో అలా.. మరో దాంట్లో ఇలా: ధోనీ రనౌట్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం!