భారత్ జట్టు విండీస్ పర్యటన పరిపూర్ణం.. రెండో టెస్టులో ఘన విజయం

7:05 am, Tue, 3 September 19

కింగ్స్‌టన్ (జమైకా): విండీస్ పర్యటనను భారత్ పరిపూర్ణం చేసింది. కరీబియన్ గడ్డపై టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కింగ్స్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరిగిన చివరిదైన రెండో టెస్టులో భారత ఘన విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.

468 పరుగుల లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 210 పరుగులకే కుప్పకూలి 257 పరుగుల భారీ ఆధిక్యంతో పరాజయం పాలైంది. విండీస్ ఆటగాళ్లలో బ్రూక్స్ (50), బ్లాక్‌వుడ్ (38), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ రెండు, బుమ్రా ఒక వికెట్ నేల కూల్చాడు.

విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్2ను 3-0తో, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కోహ్లీ సేన విండీస్ పర్యటనను పరిపూర్ణంగా ముగించింది. సెంచరీ వీరుడు హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 416 ఆలౌట్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 117 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 168/4 డిక్లేర్డ్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్