భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణ గండం…!

4:43 pm, Sat, 15 June 19

మాంచెస్టర్: భారత్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.

మాంచెస్టర్ వేదికగా రేపు ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే వరల్డ్‌క్‌పను వెంటాడుతున్న వరుణుడు భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌నీ కూడా వదిలేలాలేడు.

మ్యాచ్‌రోజైన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ వర్షం కురిసే అవకాశముందన్నది స్థానిక వాతావరణ శాఖ అంచనా. అయితే ఉదయం 10లోపు, సాయంత్రం 6 తర్వాత వర్ష సూచనలేదు.

అయితే వర్షం వలన ఇప్పటికే పలు మ్యాచ్లు రద్దయిన విషయం తెలిసిందే. మొన్న గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వలన ఆగిపోయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి న్యూజిలాండ్ జట్టు 4 మ్యాచ్‌లకి గాను మూడింట్లో గెలవగా, ఒకటి టై అవడంతో….మొత్తం 7 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇంగ్లండ్ 6 పాయింట్లతో రెండో స్థానంలో , భారత్ 5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

చదవండి: ఇంగ్లాండ్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన వెస్టిండీస్