ఆసీస్‌ లక్ష్యం 251! సెంచరీ తో కదం తొక్కిన కోహ్లీ!

5:55 pm, Tue, 5 March 19
Virat Kohli Latest Match News, Newsxpressonline

నాగ్‌పుర్‌: రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు టీమిండియా 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విపరీతంగా స్పందిస్తున్న పిచ్‌పై కోహ్లీసేన మరోసారి తడబడింది. కంగారూలు కట్టదిట్టమైన బంతులకి భారత బ్యాటమెన్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు.

116 పరుగులతో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ …

48.2 ఓవర్లో 250 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లీ (116), విజయ్ శంకర్ (46) మినహా ఇతర బ్యాట్స్ మెన్లు ఎవరూ ఆశించిన మేరకు రాణించలేకపోయారు. ఇతర బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ డకౌట్, ధావన్ 21, రాయుడు 18, జాధవ్ 11, ధోనీ డకౌట్, జడేజా 21, కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 0 పరుగులు చేశారు. రెండు పరుగులతో షమీ నాటౌట్ గా నిలిచాడు.

ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను అతలాకుతలం చేసాడు. జంపా 2 వికెట్లు తీయగా, కౌల్టర్ నైల్, మ్యాక్స్ వెల్, లియోన్ లు చెరో వికెట్ తీశారు. నాగపూర్ పిచ్ పై పగుళ్లు ఎక్కువగా ఉండటంతో, పిచ్ బౌలింగ్ కు సహకరించే అవకాశం ఉందని మ్యాచ్ కు ముందు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఓవర్లు గడిచే కొద్దీ స్పిన్ కు సహకరించవచ్చని ఆయన అంచనా వేశారు. మరి మన స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.

చదవండి: ఆత్మవిశ్వాసంతో భారత్‌…ఆత్మరక్షణలో ఆస్ట్రేలియా! నేడే రెండో వన్డే !