రాజుగా కోహ్లీ…ఐసీసీపై ఫైర్ అవుతున్న క్రికెట్ అభిమానులు…

10:14 am, Thu, 6 June 19

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐ‌సి‌సి) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులని నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

నిన్న టీమిండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ముందు  ఐసీసీ టీమిండియా కెప్టెన్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసింది. అది కూడా కోహ్లీ ఓ చేత్తో బ్యాట్‌ను కత్తిలా ఎత్తి పట్టుకోగా, మరో చేత్తో బంతి పట్టుకుని సింహాసనంపై రాజులా కూర్చున్న ఫొటో.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐసీసీపై ఫైర్ అవుతున్నారు. ఇలా ఇండియాకి చెందిన క్రికెటర్‌నే రాజులా చూపించి మిగిలిన వారిని తక్కువ చూపించినట్లైందని నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని, తటస్థంగా ఉండాల్సిన ఐసీసీ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని మండిపడుతున్నారు.

ఇక ప్రపంచకప్‌లో భారత్ ఒక్కటే పాల్గొనడం లేదని, మిగతా జట్ల కెప్టెన్ల సంగతేంటని, మేమేమైనా జోకర్లలా కనిపిస్తున్నామా? అంటూ ఇతర దేశాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:  ప్రపంచకప్ లో బోణి కొట్టిన భారత్! సెంచరీతో చెలరేగిన రోహిత్!