వారిద్దరిలో ఎవరు గొప్పో చెప్పలేను కానీ.. కోహ్లీ మాత్రం ఆ పని చేసి తీరుతాడు: వార్న్

I can not say who is the greatest of both. Kohli is doing the job, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్- టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లేనన్నది అందరి ఏకాభిప్రాయం. ఇదే ప్రశ్నకు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా?

ఒక ఆటగాడు క్రికెట్ ఆడుతున్నప్పడు అతడి గురించి చెప్పడం కష్టమని వార్న్ తేల్చి చెప్పాడు. వన్డేల్లో వివ్ రిచర్డ్స్, విరాట్‌లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనన్నాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ ఏకంగా 24 సెంచరీలు చేశాడని, ఇది ఆషామాషీ విషయం కాదన్నాడు.

అయితే, ఒక్క విషయాన్ని మాత్రం తాను పక్కాగా చెప్పగలనన్నాడు. కోహ్లీ క్రికెట్ నుంచి తప్పుకునే సమయానికి ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయని జోస్యం చెప్పాడు.
క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్ అత్యంత గొప్ప ఆటగాడని, ఇక తాను చూసిన వాళ్లలో రిచర్డ్స్ కూడా అత్యుత్తమ ఆటగాడని కితాబిచ్చాడు. బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్‌లకు తాను బౌలింగ్ చేశానని గుర్తు చేశాడు.
 
అయితే, వీరిందరిలో కోహ్లీ ఎక్కడుంటాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటారని వార్న్ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత క్రికెట్‌లో మాత్రం కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని పునరుద్ఘాటించాడు. వివ్ రిచర్డ్స్‌కు కోహ్లీ సవాలు విసరడం మాత్రం పక్కా అని వార్న్ స్పష్టం చేశాడు.
 
 
- Advertisement -